BREAKING NEWS
Search

విజ్ఞాన విహార యాత్రలో విహరించిన డిస్నీ ల్యాండ్ విద్యార్థులు

56

వరంగల్ అర్బన్ : వరంగల్ అర్బన్ దామెర మండలం, ఒగ్లపూర్ గ్రామ పరిధిలో గల డిస్నీ ల్యాండ్ పాఠశాల యాజమాన్యం మరియు 150 మంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దక్షిణ భారత విహార యాత్రకు 13వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ఐదు రోజుల విహార యాత్రలు చేయడం జరిగిందని డిస్నీ ల్యాండ్ పాఠశాల యాజమాన్యం తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల జ్ఞాన సముపార్జన కోసం విజ్ఞాన విహార యాత్రలు విద్యార్థులను తీసుకుపోవడం జరుగుతుందని, ఈ యాత్రలు విద్యార్థుల విజ్ఞానానికి ఎంతో దోహద పడుతుందని పాఠశాల కరస్పాండెంట్ బి.శోభారాణి తెలిపారు. విద్యార్థులు చూసినటువంటి ప్రదేశాలలో మహాబలిపురం, సముద్రపు దేవాలయం, లైట్ హౌస్, కృష్ణుని కల్యాణ మండపం, పంచరధాలు, వెన్నముద్ద, వర్ష గుహ దేవాలయం, పాండిచేరి లోని అరబిందో ఆశ్రమం, వినాయగర్ గుడి, రాక్ బీచ్, పాండిచేరి మ్యూజియం, బొటానికల్ గార్డెన్, మాట్రోమోని విలేజీ, చెన్నయ్ లోని మేరీన బీచ్ మొదలైన ప్రదేశాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ యాత్ర విజయవంతం అయినందుకు విద్యార్తుల తల్లిదండ్రులు సంతోష పడ్డారు. ఈ విహార యాత్రలో డిస్నీ ల్యాండ్ పాఠశాల డైరెక్టర్లు డి.రాకేష్ భాను, డి.దినేష్ చందర్ లు పాల్గొన్నారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *