BREAKING NEWS
Search

హాలీవుడ్‌ అగ్ర నటి ఏమీ లూ ఆడమ్స్‌

83

ఏమీ లూ ఆడమ్స్‌… అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు. ఆడమ్స్‌ డ్రాప్‌ డెడ్‌ గార్జియస్‌ అనే ఒక హాస్య చిత్రంతో తెరంగేట్రం చేసారు, అంతకన్నా ముందు ఆమె విందు భవనాలలోని రంగస్థలముపై ప్రదర్శనలతో తన నటనజీవితాన్ని మొదలుపెట్టారు. టీవీ ధారవాహికలలో అతిధి పాత్రలు మరియు బి తరగతి చిత్రాలలో కొన్ని పాత్రలు పోషించిన మీదట ఆమెకు 2002లో క్యాచ్‌ మీ ఇఫ్‌ యు కాన్‌ చిత్రంలోని బ్రెండా స్ట్రాంగ్‌ పాత్ర వచ్చింది, కానీ 2005లో వచ్చిన జూన్‌ బగ్‌ చిత్రంలోని యాష్లీ జాన్స్టన్‌ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది, దీనితోనే ఆమెకు మంచి పేరు, ఉత్తమ సహాయనటిగా అకాడమీ అవార్డు ప్రతిపాదన వచ్చాయి. తర్వాత ఆడమ్స్‌, డిస్నీ 2007 చిత్రం ఎన్‌చాంటెడ్‌లో నటించింది, ఈ చిత్రం ఆమెకు ఒక కీలకమైన వాణిజ్యపరమైన విజయంతో పాటు, ఈ చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు కుడా ప్రతిపాదించబడింది.

ఆతర్వాత సంవత్సరం డౌట్‌ చిత్రంలో ఆమె పోషించిన యువ సన్యాసిని సిస్టర్‌ జేమ్స్‌ పాత్ర, ఆమెకు తన రెండవ అకాడమీ అవార్డ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ ప్రతిపాదనలు సాధించిపెట్టింది. ఆమె నాటకీయమైన మరియు హాస్యభరితమైన పాత్రలు పోషించినప్పటికి వైవిద్యమైన పాత్రలు కూడా పోషించగలదన్న కీర్తి సాధించారు. ఆడమ్స్‌ 2008లో వచ్చిన చిత్రం సన్‌ షైన్‌ క్లీనింగ్‌లో ఎమిలీ బ్లంట్‌ అలన్‌ హార్కిన్‌తో కలిసి నటించారు. 2009 నుండి ఆమె నైట్‌ అట్‌ ది మ్యూజియమ్‌: బాటిల్‌ ఆఫ్‌ ది స్మిత్‌సోనియన్‌లో అమీలియా ఇయర్‌హాఁట్‌ పాత్ర జూలీ ఞ జూలియాలో రచయిత్రి జూలీ పొవెల్‌ పాత్రలలో నటించారు. ఆడమ్స్‌ విసెంజా, ఇటలీలో ఏడుగురు పిల్లల్లో నాలుగవ అమ్మాయిగా అమెరికా దేశస్థులైన కాత్రిన్‌ (నే హికెన్‌) రిచర్డ్‌ ఆడమ్స్‌కి జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఇద్దరు సహోదరిలు.

ఆమె తండ్రి ఒక అమెరికా ఉద్యోగి ఆమె జన్మించేనాటికి ఆయన కాసేర్మ ఎడేర్లెలో ఉండేవారు, ఉద్యోగరీత్యా వారి కుటుంబం అనేక ప్రదేశాలలో నివసించారు, ఆమెకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి ఆయన కాజిల్‌ రాక్‌, కొలరాడోకి వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత నుండి ఆమె తండ్రి రెస్టారెంట్లలో పాటలు పాడటం వృత్తిగా చేసుకున్నారు. తల్లి కూడా దేహధారుడ్య శిక్షకురాలుగా పనిచేసేవారు. ఆడమ్స్‌ ఒక క్రిస్టియన్‌ లాగా పెరిగారు, కానీ ఆమెకు 11 సంవత్సరములు ఉన్నప్పుడు తల్లి తండ్రి విడాకులు తీసుకోవటం మూలంగా ఆమె కుటుంబం వారు ఉంటున్న చర్చి నుండి బయటకు వచ్చేసింది. ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగటం వలన ఆమె ఏమన్నారంటే అది నాకు మంచి విలువలను నూరిపోసింది నేను ఇప్పటికి వాటికి కట్టుబడి ఉన్నాను.

ఇతరులకి సహాయం చెయ్యాలి, ప్రేమగా వుండాలి… అనే మూలసూత్రం, అది నా లోపల జీర్ణించుకుపోయింది. ఆమె డగ్లస్‌ కౌంటీ ఉన్నత విద్యాలయంలో చదివినన్ని సంవత్సరాలు విద్యాలయం గాయకబృందంలో పాటలు పాడేవారు. ఒక స్థానిక నాట్యాలయంలో బాలేరీన నృత్యరీతిని నేర్చుకోవాలనే ధ్యేయంతో శిక్షణ పొందారు. ఆమె తల్లితండ్రులు ఆమె తన క్రీడా శిక్షణ కొనసాగించాలని ఆశించారు ఎందుకంటే దానివలన ఆమెకు కళాశాలలో విద్యార్ధివేతనం పొందే అవకాశం ఉంటుంది అని, కానీ ఆమె దాన్ని నాట్యం నేర్చుకోవటం కోసం వదిలేసారు. తర్వాత ఆడమ్స్‌ తను ఇక మీదట విద్యాలయంకి వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నారు. అందరిలాగా నేను విద్యాలయంలో ఉండి సంతోషం పొందే అమ్మాయిని కాదు కానీ నేను చదువుకోలేక పోతున్నానని చింతగా ఉంది.

ఉన్నత విద్యాలయంలో విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె తన తల్లితో కలిసి అట్లాంటా వెళ్లారు. బాలేరీన నృత్యరీతిలో రాణించే దానికి తనకు తగినంత అదృష్టం లేదు అనుకుంటూ ఆమె సంగీత శిక్షణాలయంకి వెళ్లారు, నా వ్యక్తిత్వానికి ఇదే బాగా సరిపోతుంది అని ఆమె అనుకున్నారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కమ్యూనిటీ థియేటర్స్‌లో ప్రదర్శనలు ఇస్తూనే తనని తను పోషించుకోవటానికి గ్యాప్‌ అనే వస్త్రదుకాణంలో పనిచేసారు. ఆమె హూటర్స్‌ అనే ఒక భోజనాలయంలో అతిధులను ఆహ్వానించే ఒక ఉద్యోగంలో చేరారు, ఒక నిజం ఏంటంటే కొద్ది రోజులు పూర్తి జన సమ్మర్దంలో ఉండే వృత్తిలో ఆమె వున్నారు. ఆడమ్స్‌ ఆ ఉద్యోగాన్ని మూడు వారాల తర్వాత తన మొదటి కారుని కొనుక్కోవటానికి చాలినంత డబ్బు సంపాదించుకున్న తర్వాత మానేసారు.

ఆమె నేను హూటర్స్‌ గురించి ఏదైతే అనుకున్నానో అలా అనుకోవటం నిజంగా నా అమాయకత్వం. అయిన నేను మధ్యంని నీళ్ళని కలప కూడదని తెలుసుకున్నాను! అని అంగీకరించారు. ఆమె బౌల్డర్స్‌ డిన్నర్‌ థియేటర్‌, కంట్రీ డిన్నర్‌ ప్లే హౌస్‌లలో నాట్యం చేయటం వృత్తిగా మొదలుపెట్టారు. అక్కడ ఆమె 1995లో మిన్నేపోలిస్‌ విందు భవనం నిర్వహణాధికారి మైఖేల్‌ బ్రిన్దిసి, దృష్టిని ఆకర్షించింది. ఆడమ్స్‌ అక్కడ నుండి చన్హాసెన్‌, మిన్నెసోటాకి మారి అక్కడ చన్హాసెన్‌ డిన్నర్‌ థియేటర్‌ లలో తర్వాత మూడు సంవత్సరాలు పనిచేసింది. ఆమె కండరాల నొప్పికి చికిత్స చేయించుకుంటూనే 1999లో ఒక పరిహాస హాస్యభరితమైన చిత్రం డ్రాప్‌ డెడ్‌ గార్జియస్‌ నటపరీక్షకు హాజరయ్యారు. ఈ చిత్రం మిన్నిసోటాలో చిత్రీకరించారు, అదే ఆమె నటజీవితానికి మొట్టమొదటి పాత్ర.

డ్రాప్‌ డెడ్‌ గార్జియస్‌ చిత్రంలోని సహనటుడు కిర్స్టీ అలె నచ్చచెప్పటం వలన ఆడమ్స్‌ జనవరి 1999లో కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌కి వెళ్లారు. అక్కడ తన మొదటి సంవత్సరం అనుభవం గురించి ఆమె అది తనకి ఒక చీకటి సంవత్సరం అని అతి శీతలం అయిన సంవత్సరం అని అన్నారు. అ సమయంలో ఆమె చన్హాసెన్‌లో ఉన్నప్పుడు తన అనుభవాలని గుర్తుకు తెచ్చుకొని బాగా బెంగ పెట్టుకున్నారు, అక్కడ నేను కలిసి పనిచేసిన వారందరు నా కుటుంబసభ్యుల లాంటి వారు అని అన్నారు. లాస్‌ ఏంజెల్స్‌కి వచ్చిన తర్వాత ఆమె ఫాక్స్‌ నెట్వర్క్‌ వారి దూరదర్శన్‌ ధారావాహికలు క్రూయెల్‌ ఇంటన్షన్స్‌, మాంచెస్టర్‌ ప్రెప్‌లో కాత్రిన్‌ మేర్షుఎల్స్‌ పాత్రలో నటించారు.

కానీ ఈ ధారావాహిక ఆ నెట్వర్క్‌ అంచనాలు అందుకోలేక పోయింది, అనేకసార్లు స్క్రిప్ట్‌ని సవరించిన మీదట, రెండు సార్లు నిర్మాణం ఆగిపోవటం వలన ఆ ధారావాహిక రద్దు చేయబడింది. చిత్రీకరించిన భాగాలను మరల ఎడిట్‌ చేసి ఒక వీడియో చిత్రంగా క్రూయెల్‌ ఇంటన్షన్స్‌ 2 పేరుతో విడుదల చేసారు. 2000 నుండి 2002 వరకు దూరదర్శన్‌ కార్యక్రమాలు దట్‌ సెవన్టీస్‌ షో, చార్మడ్‌, బఫి ది వంపైర్‌ స్లేయర్‌, స్మాల్‌ విల్లె, ది వెస్ట్‌ వింగ్‌ వంటి దూరదర్శన్‌ ధారావాహికలలో నటిస్తూనే ఆడమ్స్‌ సైకో బీచ్‌ పార్టీ వంటి చిన్న చిత్రాలలో నటిస్తుండేది. ఆ తర్వాత ఆమె స్టీవెన్‌ స్పీల్బర్గ్‌ చిత్రం క్యాచ్‌ మీ ఇఫ్‌ యు కాన్‌లో బ్రెండా స్ట్రాంగ్‌ పాత్రలో నటించింది, ఈ చిత్రంలో ఈమెది ఒక నర్సు పాత్ర, ఈమెతో ఫ్రాంక్‌ అబగ్నలే, జూనియర్‌ (లియోనార్డో డికాప్రియో) ప్రేమలో పడతాడు.

స్పీల్బర్గ్‌ మాటల్లో ఈ పాత్రతో ఆమె నటనా వృత్తిలో స్థిరపడింది అన్నారు. కానీ అ తర్వాత సంవత్సరం కూడా ఆమె అంతగా అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. కానీ ఆడమ్స్‌ నేను కూడా స్టీవెన్‌ స్పీల్బర్గ్‌ ఆకట్టుకునే స్థాయిలో నటించగలనని తొలిసారిగా తెలుసుకున్నాను… ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అన్నారు. 2004లో ఆమె ది లాస్ట్‌ రన్‌ చిత్రంలో ఇంకా కింగ్‌ అఫ్‌ ది హిల్‌ అనే యానిమేటెడ్‌ దూరదర్శన్‌ ధారావాహికకు ఆమె తన గాత్రాన్ని అందించారు. ఇంకా ఆమె దూరదర్శన్‌ ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్‌ వెగాస్‌లో ఆలిస్‌ డార్టీ పాత్రలో నటించారు. కానీ కొన్ని ఒప్పందానికి సంబంధించిన గొడవల వలన ఆ పాత్ర నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఏప్రిల్‌ 2008, నాటికి ఆడమ్స్‌ ఆరు సంవత్సరాలుగా ఉన్న తన ప్రియుడు, నటుడు, చిత్రకారుడు అయిన డారెన్‌ లి గాలోతో కలిసి ఉండటానికి నిశ్చయం జరిగింది. ఆమె లి గాలోని 2001లో ఒక నటశిక్షణా తరగతిలో కలిసారు. ఆమె తరగతిలో అందరికన్నా బాగా ఆకర్షించింది, ముందు అతను ఆమెను చూసి ఎలెక్షన్‌ చిత్రంలో ట్రేసి ఫ్లిక్‌ వలె వుంది అని అనుకున్నాడు. వాళ్ళు ఇద్దరు కలుసుకున్న ఒక సంవత్సరం తర్వాత ఆడమ్స్‌ లి గాలో ఇద్దరు కలిసి ఒక తక్కువ నిడివి చిత్రం పెన్నీస్‌లో ఒక వారం వరకు నటించారు, ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగింది. ఆ వెంటనే వారు ఇద్దరు కలిసి నివసించటం మొదలు పెట్టారు. మే 15, 2010, ఆడమ్స్‌ వారిద్దరి జంట మొదటి బిడ్డ పాపకి జన్మనిచ్చింది. పాప పేరు అవియాన లి గాలో.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *