BREAKING NEWS
Search

కర్ణాటక ఉప ఎన్నికల్లో బోణి కొట్టిన బీజేపీ

27

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఫలించాయి.ఫలితాల్లో అధికార భాజపా బోణీ కొట్టింది. ఎల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవ ర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్‌ శివరామ్‌ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక మరో 11 చోట్ల కాషాయ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగు తున్నారు. కాంగ్రెస్‌ 2 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది. కర్ణాటకలో మొత్తం 223 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం భాజపా సంఖ్యా బలం 105. ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది.బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తాజా ఫలితా ల్లో కనీసం ఆరు చోట్ల గెల వాల్సి ఉంది. అయితే, దాదాపు 12 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.బీజేపీ అనుకూల ఫలితాలతో పార్టీ నేతలు సంబ రాలు జరుపుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యాడి యురప్ప ఇంటికి బీజేపీ నేతలు క్యూ కట్టారు.ప్రజల మద్దతు బీజేపీ వైపు ఉందని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని డిప్యూటీ సీఎం ఆస్వాత్ నారాయణ్ అన్నారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *