BREAKING NEWS
Search

భార్యకు తెలియకుండా భర్తకు రెండో పెళ్లి చేసిన బెజ్జోరా గ్రామ సర్పంచ్

35

నిజామాబాద్ జిల్లా:- భీంగల్ మండలం లోని బెజ్జోరా గ్రామంలో కొగురు శ్రీవాణి శుక్రవారం గ్రామసర్పంచ్ ఇంటి ముందర ధర్నాచేపట్టింది. వివరాలలోకి వెళ్లితే ఆమెకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని తండ్రి సూళ్ల నర్సయ్య తెలిపారు. అప్పట్లో అతనికి సుమారుగా 4 లక్షలు వరకట్నం ఇచ్చారని, బాబు జన్మించాడు.ఆ బాబు 9 నెలలకే మరణించాడు. అనంతరం రెండవసారి జన్మనివ్వడానికి ముందే గర్భంలోనే శిశువు మృతి చెందిందని తెలిపారు. కొంత కాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆసుపత్రిలో తన తండ్రి చూయించడాని దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ వ్యాధిని నయం చేయించారని తేలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సమాచారం లేకుండానే తన భర్త కొగురు నరేష్ కు గ్రామ సర్పంచ్ భర్త కొగురు సుమన్ రెండు రోజుల కింద రెండవ పెళ్లి చేశారని ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్ ఇంటి ముందు ధర్నా చేసి వంటా వార్పూ నిర్వహించి ఆమె బంధువులు నిరసనకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగే. వరకు ధర్నాను విరమిచేది లేదని బంధువులు ఆరోపిస్తున్నారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *