BREAKING NEWS
Search

షైన్ పాఠశాలలో క్రీడ దినోత్సవ వేడుకలు

34

వరంగల్ అర్బన్ : హన్మకొండ బాలసముద్రం లోని షైన్ షైన్ స్కూల్ విద్యార్థులు క్రీడా దినోత్సవాన్ని ఘనమైన వేడుకల జరుపుకున్నారు .శిశు తరగతి నుండీ ఐదవ తరగతి వరకు గల బాలబాలికల అందరూ రకరకాల సామూహిక మాస్ డ్రిల్స్ లో పాల్గొని రకరకాల ప్రాపర్టీలను ఉపయోగిస్తూ చూపరులకు నేత్రానందాన్ని కలిగించారు. ఈ వేడుకను చూడడానికి వచ్చిన బాలబాలికల తల్లిదండ్రులకు మనోలసాన్ని కలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సుబేదారి సి.ఐ. అజయ్ కుమార్, రమేష్, మోటివేషనల్ స్పీకర్ శాంతి స్వరూప్ లు మాట్లాడుతూ తల్లిదండ్రులకు పిల్లల యొక్క పెంపకం గురించి అవగాహనా కల్పించారు. పిల్లలకు చదువుతో పాటుగా శారీరక దృఢత్వం ,వ్యాయామాలు అవసరమని గుర్తించిన పాఠశాలల్లో షైన్ స్కూల్ మొదటి స్థానంలో ఉందని, ట్రై సిటీలో క్రీడా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకొనే పాఠశాలల్లో షైన్ పాఠశాల ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు రాజేందర్, డా.వేణు, ప్రైమరీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి రమ, ప్రిన్సిపాల్ ఆర్.ప్రగతి రెడ్డి, వివిధ బ్రాంచీల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *