BREAKING NEWS
Search

‘పైడి’ పలుకులు…

89

* నీ పొరపాట్లు, తొందరపాటు మరొకరికి అగచాటు కాకూడదు.
* నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది నీ ‘పాలు’.
* అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని!
* మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే ‘కావాలి’ అని అనుకోవడం ఉత్తమం.
* జరిగేదేదో జరుగక మానదు. నీ అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.
* ‘కల’లంటే నిద్రలో వచ్చేవే కాదు అవి సాకారం అయ్యేదాకా నిద్ర పోనివ్వనివి కూడా!
* అందరినీ అన్నివేళలా సంతృప్తిపరచాలంటే ఓటమి తప్పదు.
* ‘విజయం’ నిన్ను పదిమందికి పరిచయం చేస్తుంది. ఓటమితో నీకు ప్రపంచం పరచయమవుతుంది.
* ‘విజయాలు’ తలకెక్కుతే ఇక విజయాల బాట తప్పినట్లే!
* ‘విజయం… గెలుపు’ శాశ్వతం కావు. అలాగే అపజయం… ఓటమి ‘అంతిమం’ కావు.
* వైఫల్యాలు సాధారణంగా ‘నిరాశ, నిర్లిప్తత’కు దారితీస్తాయి. వాటిని అధిగమించే వాడే గెలుపు బాట పడతాడు’.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *