BREAKING NEWS
Search

విహారయాత్రలతో విద్యార్థులకు విజ్ఞానం : బేరి రాంచెదర్ యాదవ్

36

శేరిలింగంపల్లి : మిట్టకంకల్ గ్రామ పంచాయితీలో ప్రాథమిక పాఠశాల నుండి విజ్ఞాన విహారాయత్రకు తేదీ.05.01.2020. నాడు బేరి వెంకటమ్మా వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రాంచెదర్ యాదవ్ గారి కృషితో ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. ప్రభుత్వం పాటశాల విద్యార్థిని విద్యార్థుల మరియు ప్రవేట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు 1వ.తరగతి నుండి 6వ.తరగతి వరకు విహారాయత్రకు సర్పంచ్ శ్యామ్ కుమార్ ట్రస్ట్ ఛైర్మన్ రాంచెదర్ యాదవ్ గార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు టీచర్స్ మాట్లాడుతూ.. యాత్ర ద్వారా విద్యార్థులు మన దేశ సాంస్కృతిని చరిత్రను తెలుసుకుంటారని అన్నారు. పురాతన చరిత్ర, మనీయులు వారు దేశం మరియు రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేసారో తెలుస్తుందని అన్నారు. అదేవిధంగా జూపార్క్ లో వివిధ రకాల జంతువులను, పక్షులను గురుంచి క్లుప్తంగా తెలుస్తుందని తెలిపారు. పాఠాలు చెప్పేతే విని, వాటిని చూస్తే విహారాయత్ర ద్వారా అవగాహన వస్తుందని అన్నారు. ప్రత్యక్షంగా వీక్షించడం వలన మేధస్సు పెరుగుతుంది. విహారయాత్రల ద్వారా పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు. గ్రామస్తులు, యువకులు పిల్లల తల్లిదండ్రులు ట్రస్ట్ చైర్మన్ రాంచెదర్ యాదవ్ గారికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్కూల్ టీచర్స్ శ్రీనివాస్, అరుణ, స్కూల్ చైర్మన్ అంజయ్య, శేఖర్, యువజన సంఘం అధ్యక్షుడు సతయ్య, సెక్రెటరీ జయరాజ్, శేఖర్ రెడ్డి, వార్డుమెంబర్స్ మాణీక్యం, సతయ్య, శ్రీకాంత్, గ్రామస్తులు రాఘు, బందయ్య, తిమన్న, శ్రీను, మహేందర్, శివ, శ్రీను, ఆనంతయ్య, కృష్ణ, ప్రవీణ్, అర్జున్, శ్రీను, నర్సింలు మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

 




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *