BREAKING NEWS
Search

ఇంటిని కలర్‌ఫుల్‌గా అలంకరించుకోవాలంటే?

92

మీ ఇంటిని కలర్‌ఫుల్‌గా రూపొందించేందుకు ప్రయత్నించండి. మీ టీపాయ్‌ను పూలతో కూడుకున్న మ్యాగజైన్‌లోతో అందంగా తీర్చిదిద్దండి. డార్క్‌ కలర్‌తో కూడుకున్న పూలకుండీలను ఏర్పాటు చేసుకోండి. దీంతో ఇంటి అందం మరింత రెట్టింపవుతుంది. మీ ఇంట్లోని గెస్ట్‌ రూంలో ఏదైనా ఓ శిలలాంటి బొమ్మ లేదా స్ట్యాచ్యూ ఉంచండి. దీంతో ఆ గదికే ఓ ప్రత్యేకత వస్తుంది. మీ ఇంట్లోని హాలులో ఓ టేబుల్‌పై క్రిస్టల్‌ వస్తువులను అలంకరించండి. దీంతో గది వాతావరణం చల్లగా ఉంటుంది. ఇంటికే ఓ కొత్త అందం సంతరించుకుంటుంది.

ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో మహిళలు నిరంతరం శ్రమిస్తుంటారు. మరింత అందంగా తీర్చిదిద్దేందుకుగాను ఇంటి కిటికీలు, తలుపులు, గోడలు మొదలైన ప్రదేశాలలో గ్లాసులను అలంకరించండి. వీటిపై మీకు వీలైతే గ్లాస్‌ పెయింటింగ్‌ వేయించండి లేదా పెయింటింగ్‌తో కూడుకున్న గ్లాస్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఇంట్లో అలంకరించండి. మీ ఇంట్లో పిల్లల గది రంగులమయం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు రంగులంటే చాలా ఇష్టం. పిల్లలుండే గది గోడలకు ఎనామిల్‌ ప్రింట్‌ లేదా కార్టూన్‌లలోని పాత్రలకు చెందిన పోస్టర్‌లు అంటించండి. మీరుండే ఇల్లు చిన్నదిగా ఉంటే అందులోని గదులు చిన్నవిగానే ఉంటాయి. ఆ గదులను పెద్దవిగా కనపడేలా ఉంచాలనుకుంటే ఏక్సెంట్‌ లైట్‌ను ఉపయోగించండి. ఆ లైట్‌ను ఫర్నీచర్‌ లేదా వాల్‌ ఆర్ట్‌పై ఫోకస్‌ చేయండి.

దీంతో చిన్న గదికూడా పెద్ద గదిలా కనపడుతుంది. ఇంట్లో పడక గదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ పడక గదిని అందంగా తీర్చిదిద్దడమే ఓ ప్రత్యేకత. పడక గదికి ప్రత్యేక అందాన్ని తెచ్చేందుకు దుప్పట్లను అలంకరించడంతో మీ బెడ్‌కు అందం వస్తుంది. మీరు వాడే దుప్పట్లపై సముద్రపు అలలు, ఇసుక తిన్నెలు, పక్షుల చిత్రాలు తదితర డిజైన్లుండేలా చూసుకుని కొనండి. ప్రస్తుతం ఇలాంటి దుప్పట్లు, బెడ్‌షీట్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ రకం దుప్పట్లు వారానికి ఒకసారి మారుస్తుంటే మీ పడక గది అందంగాను, ఆకర్షణీయంగాను కనపడుతుంటుంది. దీంతో మనసుకు ఆహ్లాదాన్నిచ్చి, మీ అలసట దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలావుండగా, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వంటిల్లు మొదలుకుని.. డ్రాయింగ్‌ రూమ్‌ దాకా చెక్క సామగ్రి వాడకం సర్వసాధారణం. ముఖ్యంగా వంటింట్లో చెక్క పాత్రలు, గరిటెల వాడకం బాగా పెరిగింది. ఎంతో ఖరీదైన ఈ చెక్క వస్తువులు సూర్యరశ్మి, పొడి వాతావరణం కారణంగా తొందరగా పాడవుతాయి. అయితే వీటిని ఉపయోగించటంలో కొన్ని చిట్కాలను పాటించినట్లయితే… ఎంతో కాలం మన్నుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధ్యమైనంత వరకూ వీటికి నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి. ఇండోర్‌ మొక్కలు, నీటితో నింపిన పాత్రలు ఇంట్లో అక్కడక్కడా పెట్టడం వల్ల, తేమ ఏర్పడి ఫర్నీచర్‌ త్వరగా పాడవకుండా ఉంటుంది.

టేకు ఫర్నీచర్‌ గనుక వాడుతున్నట్లయితే… ఏడాదికి రెండుసార్లు టీక్‌ ఆయిల్‌ లేదా క్రీమ్‌ను వాడాలి. వైర్‌ ఊల్‌ సహాయంతో చేతికి గ్లోవ్స్‌ వేసుకుని ఫర్నీచర్‌కు పట్టిస్తే, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఓక్‌ ఫర్నీచర్‌ వాడుతున్నట్లయితే, వాటిని శుభ్రంగా తుడిచి, వెచ్చటి వెనిగర్‌తో పాలిష్‌ చేస్తే ఇట్టే మెరిసిపోతాయి. కొత్తగా కొనే చెక్క పాత్రలను రాత్రంతా సెడర్‌ వెనిగర్‌లో ముంచి ఉంచినట్లయితే, ఆయా పాత్రలు కూరల వాసనను పీల్చుకోకుండా ఉంటాయి. మరుసటి రోజు పేపర్‌ టవల్స్‌తో పొడిగా తుడిచేస్తే సరిపోతుంది.

సలాడ్ల కోసం వాడే చెక్క పాత్రలను సబ్బుతో కడగకుండా.. ఆలివ్‌ ఆయిల్‌లో ముంచిన వస్త్రంతో బాగా తుడిచి, గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఆరిన తరువాత నూనెను మళ్లీ పైపైన పూయాలి. ఈ చిన్ని చిట్కాలను పాటించినట్లయితే… మీ ఇంట్లోని ఉడెన్‌ ఫర్నీచర్‌ కొత్త అందంతో మెరిసిపోతుంది సుమా!
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *