BREAKING NEWS
Search

పొగతాగుడులోనూ పోటీయేనా?

67

పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌…! అనే ధూమపాన ప్రియుల మాటల్ని నేడు మన భారతదేశ మహిళామణులు బాగానే వంటబట్టించుకున్నట్లు తెలుస్తోంది. పొగ సేవించే ప్రపంచంలోని టాప్‌-20 దేశాల జాబితాలో మన మహిళా మణులు ముచ్చటగా మూడో స్థానాన్ని అలంకరించటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక అన్నింట్లోనూ అగ్రరాజ్యంగా కొనసాగుతోన్న ప్రపంచ పెద్దన్న అమెరికా ఈ విభాగంలో సైతం తన ”అగ్ర” హోదాను నిలబెట్టేసుకుంది. ఈ దేశంలో 2.3 కోట్లమంది మహిళలు ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లను ఊది పారేస్తున్నారట. అలాగే జనాభాలో ముందువరుసలో ఉన్న చైనా 1.3 కోట్ల మంది మహిళా ధూమపాన ప్రియులతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఆ తర్వాత స్థానం మాత్రం మనదే! మన దేశంలో మహిళా ధూమపాన ప్రియుల సంఖ్య 20 శాతం లోపే ఉన్నప్పటికీ… ఇది ఆందోళనకర పరిణామమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ మనతో పోటీపడే దాయాది దేశం పాకిస్థాన్‌ మహిళా ధూమపాన సేవికుల టాప్‌-20 లిస్టులో చివరి స్థానంలో నిలవటం గమనార్హం. పాక్‌లో పొగతాడే పడతుల సంఖ్య కేవలం 30 లక్షలు మాత్రమేనట! భారత్‌లో ధూమపానం సేవించే పడతులు, ఈ అలవాటు లేని మహిళలకంటే ఓ ఎనిమిది సంవత్సరాలు ముందుగానే మృత్యువు పాలవుతున్నట్లు పై నివేదిక తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్‌ మంది మహిళలు ప్రతిరోజూ పొగ తాగుతుండగా అభివృద్ధి చెందిన దేశాలలో 22 శాతం, ఇతర దేశాలలో 9 శాతం మంది పొగతాగుతూ వారి జీవితాలను మసిబార్చుకుంటున్నట్లు ఈ నివేదిక బట్టబయలు చేసింది. కాగా, మహిళలు వారి వారి శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. తమ శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం ద్వారా పార్టీల్లో ఇతరులను ఇట్టే ఆకర్షించవచ్చు. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న మహిళలు పార్టీకి వెళ్లినప్పుడు స్ప్రింగ్‌తో తయారైన దుస్తులు బాగా అబ్బుతాయి. అలాగే లిటిల్‌ బ్లాక్‌ డ్రెస్‌లు వేయవచ్చు. అయితే పొడవాటి డ్రెస్సులను వేయకూడదు. స్కట్స్‌ లాంటివి వేయడం ద్వారా మీ ఎత్తు పెద్దగా తెలియదు.

అలాగే చీరల సంగతి కొస్తే అడ్డుగీతలతో కూడినవి వాడవచ్చు. రంగుల ఎంపికలోనూ ఎత్తుగా ఉండేవారు మైల్డ్‌ కలర్స్‌ ఎంచుకోవడం బెటర్‌. సింథటిక్‌ శారీస్‌ కట్టేటప్పుడు హ్యాండిల్‌ వర్క్‌ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యాండ్‌ వర్క్‌ శారీస్‌, ఫ్రేమ్‌, మిరర్‌ వర్క్‌, మందపాటి చీరలు కట్టడం ద్వారా ఎత్తుగా ఉండేవారు తమ డ్రెస్సింగ్‌ విధానం అందరినీ ఆకట్టుకుంటుందని డిజైనర్లు అంటున్నారు. చాలా మంది మహిళలు లేదా యువకులు పొద్దస్తమానం ఫేస్‌ వాష్‌ చేస్తున్నా వారి ముఖం జిడ్డుగా మారుతుంది. ఇలా జిడ్డు చర్మం గలవారు ఇంట్లోనే దొరికే వస్తువులతో పేస్‌ ప్యాక్‌ తయారు చేసి, దాన్ని ఉపయోగించి జిడ్డు ముఖాన్ని కాంతివంతం చేయవచ్చు.

అదెలాగంటే… పది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. కోడిగుడ్డు తెల్లసొనను మాత్రమే బాగా గిలకొట్టి, అందులోనే ద్రాక్షపండ్లను, నిమ్మరసాన్ని కూడా వేసి మరికాసేపు గిలకొట్టాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే నేచురల్‌ క్లెన్సర్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ద్రాక్షరసం వల్ల చర్మానికి మృధుత్వం వస్తుంది. కోడిగుడ్డు వల్ల చర్మం వదులుకాకుండా కాపాడుతుంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పేస్‌ ప్యాక్‌ను పొడి చర్మం గలవారు మాత్రం వాడకూడదు.

ఒకవేళ వాడినట్లయితే.. వారి చర్మం మరింత పొడిబారిపోతుంది. ఒకవేళ ఇలా పండ్లు, సౌందర్య సాధనాలను ఉపయోగించి పేస్‌ ప్యాక్‌ చేసేందుకు సమయం, ఓపికా లేనప్పుడు… నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో ముఖాన్నంతటినీ బాగా రుద్ది పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్లయితే… ముఖంలో జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా అవుతుంది.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *